🐔 చికెన్ పచ్చడి (బోన్ & బోన్‌లెస్)
సాంప్రదాయ ఆంధ్ర రుచితో తయారుచేసిన మా చికెన్ పచ్చడి ఘాటు మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మరియు ఇంటి వంట రుచితో ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది. మేము బోన్‌తో ఉన్న చికెన్ మరియు బోన్‌లెస్ చికెన్ రెండు విధాలుగా కూడా తయారు చేస్తాము.
తాజా చికెన్ ముక్కలను నాణ్యమైన మసాలాలతో బాగా వండించి, సంప్రదాయ పద్ధతిలో తయారు చేసి, ప్రతి ముక్కలో అసలైన ఆంధ్ర పచ్చడి రుచి వచ్చేలా చేస్తాము.
ఈ పచ్చడి ప్రత్యేకత ఏమిటంటే, మేము దీనిని సంప్రదాయంగా గానుగ మీద ఆడిన వెరుసెనగ నూనెతో (Groundnut oil) తయారు చేస్తాము. మీరు కోరుకుంటే గానుగ నూనెతో కూడా ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తాము.
బోన్ ఉన్న చికెన్‌లో అసలైన ట్రెడిషనల్ రుచి, బోన్లెస్లో తినడానికి సులభమైన అనుభవం లభిస్తుంది.
ఈ పచ్చడి వేడి అన్నం, నెయ్యి అన్నం, దోస, చపాతీతో అద్భుతంగా సరిపోతుంది.
✨ ముఖ్య లక్షణాలు:
బోన్‌తో & బోన్‌లెస్ చికెన్‌తో తయారీ
సంప్రదాయ ఆంధ్ర హోమ్మేడ్ రెసిపీ
గానుగ మీద ఆడిన వెరుసెనగ నూనెతో తయారీ
కావాలంటే గానుగ నూనెతో ప్రత్యేక తయారీ అవకాశం
ఘాటు మరియు రుచికరమైన స్పెషల్ మసాలా
పరిశుభ్రంగా తయారు చేసి ప్యాక్ చేయబడింది
అన్నం, చపాతీతో అద్భుతంగా సరిపోతుంది







cvenkat –
“ఆర్డర్ అందింది అండి. చికెన్ పచ్చడి రుచి అద్భుతంగా ఉంది. ఇంట్లో చేసిన పచ్చడి తిన్న ఫీలింగ్ వచ్చింది. మసాలా బ్యాలెన్స్ చాలా బాగుంది, చికెన్ ముక్కలు కూడా బాగా ఉన్నాయి. మా కుటుంబం అందరికీ చాలా నచ్చింది. తప్పకుండా మళ్లీ ఆర్డర్ చేస్తాం. Thank You SDB Natural Oils! ❤️”